తిరుమల శ్రీవారిని ప్రముఖ హాస్యనటుడు, లెజెండరీ బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బ్రహ్మానందంను చుసేందుకు భక్తులు భారీగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సెల్ఫీలు తీసుకోడానికి ఎగబడ్డారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. స్వామి దర్శనం వారికి పన్నెండు గంటల వరకూ సమయం పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,836 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,916 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.