శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

CJI Justice Uday Umesh Lalit Visits Tirumala. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్ శ‌నివారం తిరుమ‌ల చేరుకున్నారు.

By Medi Samrat  Published on  1 Oct 2022 2:15 PM GMT
శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్ శ‌నివారం తిరుమ‌ల చేరుకున్నారు. సీజేఐ హోదాలో తొలిసారి తిరుమ‌ల‌కు వ‌చ్చిన జ‌స్టిస్ ల‌లిత్‌కు ఆల‌య మ‌హాద్వారం వ‌ద్ద టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డిలు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం జ‌స్టిస్ ల‌లిత్ ఆల‌యంలోకి ప్ర‌వేశించి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధాన‌మైన పున్న‌మి గ‌రుడ సేవ శ‌నివారం రాత్రి జ‌ర‌గ‌నుంది. స్వామి వారి గ‌రుడ సేవ‌లో జ‌స్టిస్ ల‌లిత్ పాల్గొన‌నున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గరుడవాహన సేవ జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ గరుడోత్సవం నిర్వహించనున్నారు. 3 లక్షల మందిని తరలించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ బస్సులతో 3 వేల ట్రిప్పులు నడుపుతోంది. అలిపిరి పాత చెక్ పోస్టు శ్రీవారి మెట్టు వద్ద ద్విచక్రవాహనాలకు పార్కింగ్ పాయింట్ గా నిర్దేశించారు. తిరుమల కొండపై ఏడు ప్రాంతాల్లో టీటీడీ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు. తిరుమాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి భక్తులు సులువుగా ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. అన్నప్రసాదాల భవనాల్లో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1.30 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాల వితరణ చేయనున్నారు. తిరుమాడ వీధుల్లో 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. లడ్డూల కొరత లేకుండా బఫర్ స్టాక్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు.


Next Story