రెడీగా ఉండండి.. ఉదయం 10 గంటలకు విడుదల

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఏప్రిల్ నెల కోటాను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

By Knakam Karthik
Published on : 18 Jan 2025 6:36 AM IST

telugu news, andrapradesh,tirumala,tirupati, darshan tickets

రెడీగా ఉండండి.. ఉదయం 10 గంటలకు విడుదల

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఏప్రిల్ నెల కోటాను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం ఉదయం పది గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారు జనవరి 20-22 మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లిస్తే లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. అలాగే కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు టీటీడీ రిలీజ్ చేయనుంది. రూ.300ల ప్రత్యేక దర్శనం టికెట్లు ఈ నెల 24 విడుదల కానున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి గదుల కోటాను ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆర్జిత‌సేవ‌లు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

Next Story