ద‌ర్శనం టికెట్లు ఉన్న‌ భ‌క్తుల‌కు మాత్రమే అనుమతి

allowed only for devotees who have tickets. అక్టోబ‌రు 11వ తేదీ గ‌రుడ సేవ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌ శ్రీ‌వారికి ప‌ట్టు

By Medi Samrat  Published on  9 Oct 2021 12:41 PM GMT
ద‌ర్శనం టికెట్లు ఉన్న‌ భ‌క్తుల‌కు మాత్రమే అనుమతి

శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భాగంగా అక్టోబ‌రు 11వ తేదీ గ‌రుడ సేవ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌ శ్రీ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు సమర్పిస్తార‌ని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు తెలిపారు. ఈ నేఫ‌థ్యంలో తిరుప‌తి, తిరుమ‌ల‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న కార‌ణంగా మ‌రింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన‌ సమయంలో కార్యక్రమం జరిగే చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్ళింపు కూడా ఉంటుందని ఇది గమనించి ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా ప్రత్యామ్న‌య‌ మార్గాలను ఉపయోగించుకోవాలని తెలిపారు.

అలిపిరి, ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నం, శ్రీ‌వారి ఆల‌యం, బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, బూంది పోటు, తిరుమ‌ల‌లోని ప్రధాన కూడలిలో అద‌న‌పు పోలీస్ సిబ్బందిని, క్విక్ రెస్పాన్స్ టీంలు, రెస్కూటీంలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఎస్ఎస్‌డి, రూ.300- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం టికెట్లు క‌లిగిన భ‌క్తుల‌ను మాత్రమే అలిపిరి వ‌ద్ద అనుమ‌తించేలా చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు. ద‌ర్శనం టోకెన్లు, టికెట్లు లేని భ‌క్తుల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో తిరుమ‌ల‌కు అనుమ‌తిలేద‌ని, ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి, పోలీస్ సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


Next Story
Share it