Fact Check : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురూ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Sept 2020 8:20 PM ISTఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇండియన్ పోలీసు సర్వీస్ (ఐపీఎస్) ఆఫీసర్లుగా బాధ్యతలు తీసుకోబోతున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ కుటుంబం ఆడపిల్లలను, అబ్బాయిలను ఒకే రకంగా చూసిందని.. ఇద్దరు అన్నలు, చెల్లెలు కలిసి ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారని పలు భాషల్లో ఓ ఫోటోను పోస్టు చేస్తూ ఉన్నారు.
సోఫాలో మధ్యలో ఒక అమ్మాయి కూర్చుని ఉండగా.. ఇంకో ఇద్దరు ఇరువైపులా కూర్చున్న ఫోటో కింద 'ఇద్దరు అన్నలు.. వారి చెల్లి ఒకే సారి ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు' అని కథనాలను పోస్టు చేస్తూ ఉన్నారు.
'కేవలం జీన్స్ మాత్రమే కాదు.. సిగరెట్ల విషయంలో మాత్రమే కాదు.. సమాన హక్కులు, సమాన అవకాశం.. ఇద్దరు అన్నలు, వారి చెల్లెలు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. ఆడపిల్ల భారం కాదు.. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి' అంటూ బెంగాలీలో ఉన్న మెసేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆ ఫోటోలో ఉన్న వారు ఒకే కుటుంబానికి చెందిన వారని సామాజిక మాధ్యమాల్లో చెబుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ పోస్టు అబద్ధం.
న్యూస్ మీటర్ ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఐపీఎస్ అయిన ప్రొబథియోనీర్ పూజ వశిష్ట్ ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోను పోస్టు చేశారు. ఆ ఫోటోలో మధ్యలో ఉన్నది పూజ వశిష్ట్ కాగా మిగిలిన వ్యక్తులను తుషార్ గుప్తా, శ్రుత్ కీర్తి సోమవంశీగా గుర్తించారు.
�
View this post on Instagram�
People who make life easier. #mypeople #ipslife #ceremonialwear #khaki
A post shared by Pooja Vashisth (@pooja.vashisth.25) on
తుషార్ గుప్తా ఈ ఫోటోను ఆగష్టు 22, 2020న తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశాడు. వశిష్ట్, సోమవంశీని కూడా ట్యాగ్ చేశాడు.
ముగ్గురి పూర్తి పేర్లు చూడగా ఒక్కరి ఇంటి పేరు కూడా ఇతరులతో సంబంధం లేకుండా ఉంది. దీన్ని బట్టే వారు అన్నాచెల్లెళ్లు కాదని చిన్న క్లూ లభించింది.
న్యూస్ మీటర్ ఇండియన్ పోలీసు సర్వీస్ 2018 కు చెందిన సభ్యుల లిస్టును అధికారిక వెబ్సైట్ ద్వారా సేకరించింది. ఈ ఫోటోలో ఉన్న ముగ్గురూ ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రానికి చెందిన వారు. తుషార్ పంజాబ్ రాష్టానికి చెందిన వారు కాగా.. పూజ హర్యానా.. శ్రుత్ కీర్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు.
https://ips.gov.in/Empanelment/Cadreallocationcivil_201719122018.pdf
మరో ఇంస్టాగ్రామ్ పోస్టులో పాసింగ్ అవుట్ పెరేడ్ కు సంబంధించిన ఫోటోను పూజ వశిష్ట్ పోస్టు చేసింది. ముగ్గురు ఆఫీసర్లు ఒకే బ్యాచ్ కు చెందిన వారని.. కలిసి ట్రైనింగ్ తీసుకున్నారని అర్థమవుతుంది. అంతేకానీ వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కాదు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టు 'నిజం కాదు'.