స్టార్ హీరోలకు బాంబ్ బెదిరింపు కాల్స్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Oct 2020 2:39 PM IST
కోలీవుడ్ స్టార్ హీరోలకు బెదిరింపు కాల్స్ రావడం తమిళనాడులో కలకలం రేపుతోంది. మంగళవారం కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్, విజయ్ కాంత్ ఇళ్లలో బాంబులు పెట్టినట్టు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్స్ వచ్చాయి. చెన్నైలోని అభిరామపురంలో ఉన్న ధనుష్ ఇంటితోపాటు.. విరుగంబాక్కమ్‌లోని విజయ్ కాంత్ ఇంట్లో బాంబులు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకు రెండుసార్లు ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేయగా ఫేక్ కాల్ అని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెండు ఫోన్ కాల్స్ చేసిన ఆ గుర్తు తెలియని వ్యక్తి గురించి.. ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధనుష్ ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ తో బిజీగా ఉండగా.. విజయ్ కాంత్ ఇటీవలే మహమ్మారి కోవిడ్-19 బారి నుండి కోలుకున్నారు.