చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన‌ వైఎస్‌ షర్మిల

YSSharmila Released From Chanchalguda Jail. పోలీసులపై దాడి కేసులో అరెస్టయిన వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

By Medi Samrat  Published on  25 April 2023 5:50 PM IST
చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన‌ వైఎస్‌ షర్మిల

YSSharmila Released From Chanchalguda Jail

పోలీసులపై దాడి కేసులో అరెస్టయిన వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రూ.30వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీల తరఫు న్యాయవాదులు సమర్పించారు. ఆ తర్వాత విడుదలకు సంబంధించిన ఆర్డర్లతో న్యాయవాదులు చంచల్‌గూడ జైలు అధికారులకు సమర్పించగా.. విడుదల చేశారు. షర్మిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. రూ. 30 వేలతో ఇద్ద‌రు ష్యూరిటీ స‌మ‌ర్పించాల‌ని కోరింది. విదేశాలకు వెళ్లాలనుకునే సమయంలో కోర్ట్ అనుమతి తప్పనిసరి తీసుకోవాల‌ని.. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. పోలీసులపై దాడి కేసులో సోమావారం అరెస్టైన ష‌ర్మిల‌కు నాంప‌ల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకు కేసులో సిట్ అధికారుల‌ను క‌లిసేందుకు లోట‌స్ పాండ్ నుంచి బ‌య‌లుదేరిన ష‌ర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. న‌న్ను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ష‌ర్మిల పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. అడ్డుకున్న పోలీసుల‌పై దాడి చేశారు. రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలిపారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ష‌ర్మిల‌ను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.



Next Story