వైఎస్సాఆర్టీపీ అధినేత్రి షర్మిలకు నాంపల్లి కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
షర్మిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. రూ. 30 వేలతో ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని కోరింది. విదేశాలకు వెళ్లాలనుకునే సమయంలో కోర్ట్ అనుమతి తప్పనిసరి తీసుకోవాలని.. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. పోలీసులపై దాడి కేసులో సోమావారం అరెస్టైన షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకు కేసులో సిట్ అధికారులను కలిసేందుకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.