అత్త ముక్కును కొరికిన కోడలు

Young lady bite aunt nose in Jogulamba Gadwal. ఈరోజుల్లో అత్తాకోడళ్లు గొడవపడటం సర్వసాధారణం. మాట మాట తిట్టుకుంటారు.

By Medi Samrat  Published on  30 Dec 2020 9:01 AM IST
అత్త ముక్కును కొరికిన కోడలు

ఈరోజుల్లో అత్తాకోడళ్లు గొడవపడటం సర్వసాధారణం. మాట మాట తిట్టుకుంటారు. అలా గొడవపడ్డ అత్తాకోడళ్లు ఒకరిని ఒకరు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం కూడా మనం చూశాం. గొడ‌వ ప‌డ‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం చూస్తూనే ఉన్నాం. అయితే.. ఓ కోడ‌లు ఏకంగా అత్త ముక్కు కొరికింది. ఈ ఘ‌ట‌న జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో జ‌రిగింది.

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మంగలి వీధిలోని నివాసముంటున్న శారదమ్మ జయన్న దంపతులు. వీరికి ముగ్గురు కొడుకులు ప్రసాద్, భాస్కర్, శేఖర్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి పెళ్లిళ్లు జరుగగా పెద్ద కొడుకు ప్రసాద్ మాత్రం అత్తగారింట్లో ఉంటాడు. మిగతా ఇద్దరు అన్నదమ్ములు తమ ఇంటిలోనే ఉండగా.. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.

సోమవారం రోజున మళ్ళీ గొడవ జరిగింది. దీంతో చిన్న గొడవ కాస్త పెద్దది గా మారింది. గొడవ జరుగుతున్న క్రమంలో చిన్న కొడుకు శేఖర్ భార్య గొడవ జరగడానికి కారణం తన అత్తనేనని కోపంతో తన అత్త పైకి వెళ్ళింది. సహానం కోల్పోయింది. అంతే.. కోపంతో అత్త శారదమ్మ ముక్కును ఒక్కసారిగా కొరికింది. తీవ్రరక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా, వైద్యులు.. ముక్కుకు ఏడు కుట్లు వేశారు. దాంతో ఆమె కోడలుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


Next Story