మార్గ‌మ‌ధ్యంలో ఆగిపోయిన‌ అంబులెన్స్.. ప్రాణాలు కోల్పోయిన మహిళ

Woman loses life due to ambulance breakdown. 108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌ పాడైపోవడంతో ఓ గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోయిన

By Medi Samrat  Published on  1 July 2022 3:49 PM GMT
మార్గ‌మ‌ధ్యంలో ఆగిపోయిన‌ అంబులెన్స్.. ప్రాణాలు కోల్పోయిన మహిళ

108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌ పాడైపోవడంతో ఓ గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన కొత్త‌గూడెం జిల్లాలో వెలుగు చూసింది. చర్ల మండలం రాళ్లాపురంలో మృతి చెందిన మడ్వి చుకుడి(21) కుటుంబ సమస్యల కారణంగా విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు సమాచారం అందించి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని ప్రధాన రహదారిపైకి తీసుకెళ్లారు. అయితే రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ కొంతదూరం వెళ్లాక ఆగిపోయింది.

కుటుంబ సభ్యులు, స్థానికులు లాగినా కదలలేదు. ఆ తర్వాత మహిళను మోటర్‌బైక్‌పై చర్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యాధికారి సాయి కళ్యాణ్ ఆమె అప్ప‌టికే మృతి చెందినట్లు ప్రకటించారు. అంబులెన్స్ చాలా కాలంగా స‌రైన‌కండీష‌న్‌లో లేద‌ని.. తరచుగా సమస్యలు వ‌స్తున్నాయ‌ని స్థానికులు అంటున్నారు. అంబులెన్స్ సక్రమంగా పనిచేసి ఉంటే.. మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరుకుని బతికే అవకాశం ఉండేదని గ్రామస్తులు పేర్కొన్నారు.


Next Story
Share it