అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న బీఆర్ఎస్.. పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడంలో కూడా ఘోరంగా ఓడిపోబోతోందని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని చాలానే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. బీజేపీ 7 నుంచి 12 సీట్ల మధ్య, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకోవచ్చునని అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ సున్నా లేదా ఒకటి మాత్రమే గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని మజ్లిస్ పార్టీ గెలుచుకోనుందని తెలుస్తోంది.
*ఆరా మస్తాన్ సర్వే
కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0, బీజేపీ 8-9, మజ్లిస్ 01
*న్యూస్18 సర్వే
కాంగ్రెస్ 5-8, బీజేపీ 7-10, ఇతరులు 3-5
*సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సర్వే
కాంగ్రెస్ 8-9, బీజేపీ 7-8, మజ్లిస్-1, బీఆర్ఎస్-0
*ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే
కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 8-10, మజ్లిస్ 01
*జన్ కీ బాత్ సర్వే
కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 9-11, మజ్లిస్ 01
*న్యూస్ మినట్ సర్వే
కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 8-12, మజ్లిస్ 01
*ఏబీపీ సర్వే
కాంగ్రెస్ 7-9, బీజేపీ 7-9, ఇతరులు - 01