తెలంగాణలో యూరియా కొరత..గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి

అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik
Published on : 21 Aug 2025 12:51 PM IST

Telangana, Central Minister Kishanreddy, Farmers, Congress, Bjp

తెలంగాణలో యూరియా కొరత..గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి

అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో.. దేశంలో ఉన్న యూరియా కంపెనీలను మూసేశారు. మేం వాటిని తెరిపించి.. యూరియా ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాం. అన్ని దేశాల్లో యూరియా ధరలు పెరిగాయి.. కానీ భారతదేశంలో మాత్రం ఒక్క రూపాయి ధర కూడా పెంచలేదు. ప్రతిసారి కేబినెట్‌లో సబ్సిడీని పెంచుతూ.. రైతులపై భారం పడకుండా చూస్తున్నాం. ఇది మా కమిట్‌మెంట్. రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ పెట్టాం. అదేమైందో తెలియదు. యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవడం, దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. మేం వేపపూత యూరియాను తీసుకొచ్చాం. ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. యూరియాకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఇవ్వడం మేం బాధ్యతగా వ్యవహరిస్తున్నాం..అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కరైకల్ పోర్టులో యూరియా ఉంది. ఇందులో 10వేల మెట్రిక్ టన్నులు, ఇఫ్కో నుంచి 15వేల మెట్రిక్ టన్నులు. క్రిభ్ కో నుంచి 17,500 మెట్రిక్ టన్నులు. రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ నుంచి 7,500 మెట్రిక్ టన్నులు తెలంగాణకు వస్తోంది. దాదాపు 50వేల మెట్రిక్ టన్నులు యూరియా ట్రాన్సిట్ లో ఉంది. కేంద్రం కమిట్‌మెంట్‌తో ఉంది కాబట్టే.. అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్నా రైతులకు మేలు చేస్తున్నాం. తెలంగాణ మంత్రులు రోజూ.. యూరియా లేదని మాట్లాడటం కారణంగా.. దొరికిన చోట కొందరు దీన్ని స్టోర్ చేసుకోవడం కారణంగా సమస్య ఉత్పన్నమైంది. 11 ఏళ్లలో ఏనాడూ యూరియా కొరత ఏర్పడలేదు. తెలంగాణ రైతుల్లో ఆందోళన రెకెత్తించడం సరికాదు. తెలంగాణకు 20 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉందని అడిగారు. ఇప్పటివరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల సప్లయ్ జరిగింది. మరో 2 లక్షల టన్నుల యూరియా అందుబాటులోకి తీసుకొస్తాం. వర్షాలు బాగా కురిశాయి. రైతులు పంట వేశారు. అందుకోసం వారికి సహకరించాల్సిన బాధ్యత.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది..అని కిషన్ రెడ్డి తెలిపారు.

Next Story