బీసీ బిల్లు కోసం ఢిల్లీ వచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే: మంత్రి పొన్నం

తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో చేపట్టిన మూడు రోజుల కార్యాచరణలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుండి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు ఢిల్లి బయలుదేరి వెళ్లారు.

By Knakam Karthik
Published on : 5 Aug 2025 11:18 AM IST

Telangana, Congress, Bc Reservation Bill, Ponnam Prabhakar, Central Government

బీసీ బిల్లు కోసం ఢిల్లీ వచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే: మంత్రి పొన్నం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లును ఆమోదించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో చేపట్టిన మూడు రోజుల కార్యాచరణలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుండి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు ఢిల్లి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీల లెక్కలు తీసి సబ్ కమిటీ, కేబినెట్,శాసన సభ ఆమోదం తెలిపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారికి బిల్లును పంపించడం జరిగింది.

శాసన సభ మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్లిన తర్వాత ముస్లింల పేరు మీద బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నాయకులు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆకాంక్షతో సామాజిక న్యాయం కోరుకునే ప్రతి వ్యక్తి ఈ మూడు రోజుల పాటు ఢిల్లీ వచ్చి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాల్సిందే. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.. కాంగ్రెస్ శ్రేణులు అంత ముఖ్యమంత్రి ,పీసీసీ అధ్యక్షుడు ఆలోచన మేరకు ఏఐసిసి ఆదేశాల మేరకు ఢిల్లీలో 5, 6, 7వ తేదీల్లో జరిగే కార్యక్రమాల్లో ఎటువంటి ఆలోచనలు లేకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో పాల్గొనాలి..అని మంత్రి పొన్నం మాట్లాడారు.

Next Story