కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి కీలకమైన మిత్రపక్షమైన టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిమిత్తం 1 ట్రిలియన్ సాయం డిమాండ్ చేస్తోందని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీనిపై కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. బలమైన ప్రాంతీయ పార్టీలకు ఓటు వేయడం ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రాలు అభివృద్ధి నిమిత్తం అధిక మొత్తంలో నిధులు డిమాండ్ చేయవచ్చనే వాదనను వినిపించారు.
“బలమైన ప్రాంతీయ పార్టీలకు ఓటు వేస్తే.. ఢిల్లీకి ఈ తరహా మార్గం ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఈ విషయాలను నిశితంగా గమనిస్తున్నారని ఆశిస్తున్నాను. స్వీయ రాజకీయ అస్థిత్వమే.. తెలంగాణకు శ్రీరామ రక్ష” అని చంద్రబాబు డిమాండ్ ను కవర్ చేసిన బ్లూమ్‌బెర్గ్ నివేదికను పంచుకున్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన చంద్రబాబు.. AP రాజధాని అమరావతి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కోరారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం మంజూరు చేసే నిధులపై చర్చ నడుస్తుంది.