షర్మిల పార్టీలోకి వస్తుందనేది నాకు తెలియదని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. ఆమె ఇంటింటికి, గ్రామ గ్రామాన తిరిగింది.. షర్మిల ఇక్కడి కంంటే అక్కడ (ఆంధ్ర)లో ఉంటే ఆమెకే ఉపయోగమన్నారు. పార్టీ నుండి ఎవరు బయటకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. సేవ్ డెమోక్రసీ పేరుతో పాట్నాలో విపక్షాల సమావేశం జరిగిందని.. నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేయాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. సిమ్లాలో ఖర్గే నేతృత్వంలో మరోసారి సమావేశం జరగనుందని తెలిపారు.
మోదీ ఆగడాలు ఆపాలంటే అన్ని పార్టీలు కలవాలని వీహెచ్ అన్నారు. పబ్లిక్ సెక్టార్ అమ్మివేస్తుంటే.. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ల రిజర్వేషన్స్ ఉండవని అబిప్రాయం వ్యక్తం చేశారు. 2024లో మోదీ పోయి.. రాహుల్ ప్రధాని కావాలని అన్నారు. ఎన్నికల కోసమే బీసీ బంధు.. లక్ష రూపాయలు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అధికార బీఆర్ఎస్‌ను విమర్శించారు. ముస్లీంలు కాంగ్రెస్ వైపు ఉన్నారు.. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వేవ్ స్టార్ట్ అయింది.. ఎవరి నోట చుసిన కాంగ్రెస్ పేరు వినిపిస్తుందని వీ హనుమంతరావు అన్నారు.