రాజ్యసభకు నాకు అవకాశం ఇస్తే బాగుంటదని.. ఎనిమిది ఏళ్లలో నాకు ఒక్క పదవి లేదని మాజీ ఎంపీ వి. హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ నాకు వస్తే గెలిచే వాడినన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణకు కురియన్ కమిటీ వస్తుందని.. కమిటీ ముందుగా సునీల్ కనుగోలును కలవాలన్నారు. టికెట్ విషయంలో నాకు కూడా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
T-20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీం కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీమ్ లో సభ్యుడు సిరాజ్ మన హైదరాబాద్ వ్యక్తి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్లాట్, ఉద్యోగం ఇస్తానన్నాడు.. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో అతని ప్రతిభను చూసి సీఎఫ్ఐ ఛైర్మెన్ గా నేను సన్మానించానని పేర్కొన్నారు.
దేశం లో క్రికెట్ కు మంచి క్రేజీ ఉంది.. తెలంగాణలో హైదరాబాద్ లో తప్ప ఎక్కడ క్రికెట్ స్టేడియం లేదు.. ఏపీలో 12 క్రికెట్ స్టేడియాలు ఉన్నాయన్నారు. స్టేడియానికి ప్రతి జిల్లాలో 12 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రేవంత్ రెడ్డికి విన్నపం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ముఖ్యమంత్రి కూడా యువకుడు అందుకే.. యువకులను ప్రోత్సహించాలన్నారు.
కేసీఆర్ స్పోర్ట్స్ ని ప్రోత్సహించలేదు, ఒక్క ఎకరం భూమి కూడా కేటాయించలేదన్నారు. అసెంబ్లీలో సమావేశాలలో క్రీడలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల ఋణమాఫీ చేస్తుండు.. అందుకు ఆయనకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ముగించారు.