ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చీకటి ఒప్పందం ఉంది: కిషన్‌రెడ్డి

ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చీకటి ఒప్పందం ఉంది..అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

By -  Knakam Karthik
Published on : 6 Nov 2025 2:50 PM IST

Hyderabad News, Jubileehills Bypolls, Union Minister Kishanreddy, Brs, Congress, Bjp

ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చీకటి ఒప్పందం ఉంది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చీకటి ఒప్పందం ఉంది..అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ..కేటిఆర్ అరెస్ట్‌ను రాహుల్ గాంధీ ఒప్పుకోట్లేదు. చాలా సార్లు రేవంత్ రెడ్డి డిపాజిట్లు కోల్పోయాడు. మా ర్యాలీ ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రం దృష్టికి ఎలెక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక గాంధీ భవన్‌లో జరగలేదు. మజ్లీస్ పార్టీ ఆఫీస్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక జరిగింది. ముస్లింల మీద ప్రేమ ఉంటే, అజారుద్దీన్‌కు టికెట్ ఎందుకు ఇవ్వలేదు. ఏ పదవి లేకుండా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు. ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి మర్చిపోయిండు. రేవంత్ రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అన్ని పార్టీలు తిరిగిండు. మజ్లీస్ పార్టీ ఒకటే మిగిలింది. భవిషత్తులో Brsతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు..అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ బీసీలకు ఇచ్చింది 32 శాతమే 10 శాతం ముస్లింలకు ఇచ్చారు. 56 శాతం బీసీలు ఉంటే 32శాతం ఎందుకు ఇస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ నేను స్పెషల్ ఫ్లైట్ దేశం మొత్తం తిరుగుతాం అన్నడు. కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. Mim, brs, కాంగ్రెస్ మూడు పార్టీలు కుటుంబ పార్టీలు. మజ్లీస్ మెప్పుకోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఉప ఎన్నికల్లో ఎవరి మధ్య పోటీ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. జూబ్లీహిల్స్ వెనుకబాటుకు brs, కాంగ్రెస్ పార్టీలే కారణం. కాంగ్రెస్ యాంటీ హిందువు పార్టీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎవరు కోరుకోలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవలేదు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది..అని కిషన్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.

Next Story