మేమెందుకు కూల్చుతాం, ఐదేళ్లు అధికారంలో ఉండాలి: కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik
మేమెందుకు కూల్చుతాం, ఐదేళ్లు అధికారంలో ఉండాలి: కిషన్ రెడ్డి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరుగుతుందనే ప్రచారంపై ఆయన స్పందించారు. ప్రభుత్వాన్ని మేము కూలగొట్టం. ఐదేళ్లు అధికారంలో ఉండాలి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓడిపోతుంది. రాష్ట్రంలో వీధి లైట్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. రాష్ట్రంలో ఎలాంటి పొత్తు పెట్టుకోము. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లా విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రజలు ఒకసారి అనుకుంటే గెలుపును ఎవరూ ఆపలేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం..అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
త్వరలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వస్తారు. జాతీయ అధ్యక్షుడు విషయంలో ఎలాంటి ప్రతిపాదన లేదు. డీలిమిటేషన్‌తో ఎలాంటి నష్టం లేదు. సీట్ల విషయంలో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు. వక్ఫ్ భూముల విషయంలో ఆందోళన చేయడం..అక్రమార్కులకు కొమ్మకాయడమే. పేద ముస్లింలకు న్యాయం జరగాలి. భూ బకాసురులు మాత్రమే ఆందోళన చేస్తున్నారు. హిందూ దేవాలయాల ఆదాయ విషయంపై చర్చ జరుగుతుంది. హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం. అందరినీ కలిసి ఓట్లు అడుగుతాం. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైన మజ్లిస్ పార్టీ న్యూ సిటీకి కూడా వ్యాపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి బాస్ కేసీఆర్ అయినా.. కాంగ్రెస్ పార్టీ బాస్ రాహుల్ గాంధీ అయినా.. వారిద్దరికీ బిగ్ బాస్ మాత్రం అసద్. హైదరాబాద్ అభివృద్ధికి నేను అడ్డు కాదు..అని కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.