కాంగ్రెస్, బీఆర్ఎస్..ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నాయి: కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నారు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik
కాంగ్రెస్, బీఆర్ఎస్..ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నాయి: కిషన్ రెడ్డి
అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నారు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించకుండా బీఆర్ఎస్ వారి పార్టీ వారిని బెదిరిస్తున్నారు. మజ్లిస్ పార్టీని గెలిపించడానికి హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్‌కు ఓటు వేయలేదు. ఓల్డ్ సిటీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడించి, ఎంఐఎంను గెలిపించడానికి ఈ పార్టీలు పోటీ చేస్తాయి. పచ్చి మతోన్మాద పార్టీతో స్నేహం చేస్తున్న మీరు సెక్యులర్ అని రాహుల్ గాంధీ దేశంలో ఎలా ప్రచారం చేస్తారు? మజ్లిస్ పార్టీ రజాకార్ల పార్టీ అవునా? కాదా.. రాహుల్‌గాంధీ చెప్పాలి..అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
చెన్నారెడ్డిని గద్దె దించడం కోసం ఓల్డ్ సిటీలో 400 మంది దళితులను ఊచకోత కోసింది నిజం కాదా? మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు ఎందుకు తాగుతున్నారో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చెప్పాలి. రజాకార్ల ఆలోచనను వ్యతిరేకించే వాళ్లు హిందూ దేవుళ్లను వ్యతిరేకించే పార్టీని.. వ్యతిరేకించేవాళ్లు మాకు ఓటు వేస్తారని విశ్వాసం ఉంది. ఓవైసీ వద్ద కూర్చున్నప్పుడు ఈ రెండు పార్టీలు వంగి వంగి నమస్కారాలు చేస్తారు. ఏ ప్రాతిపదికన బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. ఎవరిని గెలిపించడానికి పోటీ చేయడం లేదు. మీ కార్పొరేటర్లను ఓటు వేయొద్దని ఎందుకు బెదిరిస్తున్నారు...మీ కార్పొరేటట్లపై మీకు నమ్మకం లేదా ?. మీకు దమ్ముంటే మజ్లిస్ పార్టీకి ఓటువేయండి అని మీ కార్పొరేటర్లకు చెప్పే దమ్ము ఉందా? ఈ మూడు పార్టీలు ఒకటే అవసరం అయితే మజ్లిస్ పార్టీకి ముఖ్యమంత్రిని చేయడానికైనా ఈ పార్టీలు పోటీ పడతాయి. ఈ మూడు పార్టీల నిజస్వరూపం ప్రజలకు బీజేపీ తెలియజేస్తుంది. ఇతర పార్టీ ఓటర్లను కూడా ప్రజాస్వామ్య బద్దంగా మా నేతలు కలిసి ఓట్లు వేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బుల్లెట్ పై ప్రగతి బోధన్ కి వెళ్ళేవాడు అసరుద్దీన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటికి వెళ్తున్నాడు..అని కిషన్ రెడ్డి విమర్శించారు.
Live : Hon'ble Union Minister & BJP State President Shri G Kishan Reddy garu addresses the media || BJP TELANGANA https://t.co/ZOBgvjlNN3
— BJP Telangana (@BJP4Telangana) April 21, 2025