3 రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వస్తే, అలా చేయడానికి సిద్ధమే..కాంగ్రెస్‌కు కిషన్‌రెడ్డి సవాల్

ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల పోరుబాటపై రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు

By Knakam Karthik
Published on : 7 Aug 2025 9:40 AM IST

Telangana, Union Minister Kishanreddy , Revanthreddy, Congress, Rahulgandhi, Bjp

3 రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వస్తే, అలా చేయడానికి సిద్ధమే..కాంగ్రెస్‌కు కిషన్‌రెడ్డి సవాల్

ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల పోరుబాటపై రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. “ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో రెండోసారి అధికారంలోకి వస్తే …. రాహుల్ గాంధీ చెప్పింది చెయ్యడానికి నేను సిద్ధమే . దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎప్పుడో మరణశాసనం రాశారు. రేవంత్ రెడ్డి నిన్నటి ధర్నాను సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం..మోదీని తిట్టడానికి ఉపయోగించారు. రేవంత్ రెడ్డి ధర్నాను రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లు కూడా లైట్ గా తీసుకున్నారు. బీసీలను అవమానించారు..అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

అవినీతి, అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. బీసీ రిజర్వేషన్లు 27శాతానికి తగ్గించి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి గతంలో కేసీఆర్ ప్రయత్నించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అదేపని చేస్తున్నారు. బీసీలను మోసం చేసి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడం దేశానికి రాహుల్, రేవంత్ ఇచ్చే తెలంగాణ మోడలా?..అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

మహిళలకు అవమానం..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలి. రాజకీయాలకు సంబంధం లేని రాష్ట్రపతి గురించి మాట్లాడడం సిగ్గుచేటు. భారత జాతికి క్షమాపణ చెప్పాలి..ఇది మహిళలకు అవమానం..అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story