వారిపై వ్యతిరేకతకు పదేళ్లు పడితే, వీళ్లకి 15 నెలలే పట్టింది: కిషన్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పాలనలో విఫలం అయ్యాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik
వారిపై వ్యతిరేకతకు పదేళ్లు పడితే, వీళ్లకి 15 నెలలే పట్టింది: కిషన్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పాలనలో విఫలం అయ్యాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహార్ వాజ్‌పేయి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. పార్టీ ప్రారంభించినప్పుడు అధికారంలోకి వస్తుందా? అని హేళన చేశారు. బీజేపీ ప్రత్యేకమైన సిద్ధాంతం ఉంది. ఈ దేశం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అభివృద్ధి చెందిన దేశాల సరసన ఈ దేశాన్ని నిలిపేందుకే బీజేపీ ఏర్పడింది..అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
నెహ్రూ కుటుంబం మాత్రమే ఈ దేశాన్ని పాలించగలదు అని ప్రచారం జరుగుతున్న క్రమంలో కార్యకర్తలు పాలించగలరు అని బీజేపీ పార్టీ నిరూపించింది. నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పాలించిన వ్యక్తి మోడీ. నా భుతో నా భవిష్యత్ అన్న విధంగా మోడీ పాలన ఉంది. తెలంగాణలో 45 సంవత్సరాల తర్వాత బీజేపీకి అవకాశం రాబోతుంది. అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కిషన్ రెడ్డి కోరారు.
అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమైంది. బీఆర్ఎస్‌పై వ్యతిరేకత రావడానికి పదేళ్లు పడితే, కాంగ్రెస్ పార్టీకి 15 నెలలే పట్టిందని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు మజ్లిస్‌కు ఊడిగం చేస్తున్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మజ్లిస్‌ను గెలిపించడానికి పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ అవినీతి పాలన, మజ్లిస్ అధికార దాహం, బీఆర్ఎస్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను కాపాడుకోవాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన చూశారు.. ఈ సారి బీజేపీ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు.
— BJP Telangana (@BJP4Telangana) April 6, 2025