అలా చేస్తే 240 సీట్లకు ఎందుకు పరిమితం అవుతాం: బండి సంజయ్

దేశంలో ఓట్ల చోరీ జరిగిందని చెప్పిన రాహుల్‌గాంధీ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అయింది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

By Knakam Karthik
Published on : 15 Aug 2025 7:04 PM IST

Telangana,  Bandi Sanjay, Congress, Bjp

అలా చేస్తే 240 సీట్లకు ఎందుకు పరిమితం అవుతాం: బండి సంజయ్

హైదరాబాద్: దేశంలో ఓట్ల చోరీ జరిగిందని చెప్పిన రాహుల్‌గాంధీ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అయింది..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఆయన ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ..మేము ఈసీని మేనేజ్ చేసేలా ఉంటే 240 ఎంపీ సీట్లకు ఎందుకు పరిమితం అవుతాం..? ఈసీతో బీజేపీ, మోదీకి ఏం సంబంధం? ఫిర్యాదు వస్తే ఈసీ చర్యలు తీసుకుంటుంది. పాతబస్తీలో ఒక్క ఇంట్లో 300 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్లు 60 ఏళ్ళు దేశాన్ని దోచుకున్నారు మేం మీరు రిగ్గింగ్ చేశారు అన్నామా? బీహార్‌లో మీ పార్టీని నమ్మరు ...అక్కడ గెలిచేది మేమే. దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ మూర్ఖత్వంతో జెండాలను ఎగురవేయనీయలేదు. మోదీ వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ జెండా ఎగురవేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం మోదీ ఆలోచన. మోదీ పాలనకు ముందు పరిస్థితి ఏంటి, అంతకు ముందు పాలన ఏంటో ప్రజలు చూస్తున్నారు. మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు..అని బండి సంజయ్ అన్నారు.

ఇక తెలంగాణలో మార్వాడీలు గో బ్యాక్ అనేది కొంతమంది కమ్యునిస్టులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ లో నేతలు కలిసి ఆడుతున్న నాటకం. గుజరాతీ లు, మార్వాడీలు సంపద దోచుకునేందుకు రాలేదు. వారు వ్యాపారాలు చేసుకుని రాష్ట్ర సంపద ను పెంచేందుకు వస్తున్నారు. దమ్ముంటే నగరంలో ఆక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల గురించి మాట్లాడాలి. వాళ్ల వల్ల బాంబు పేలుళ్ళు జరుగుతున్నాయి. మైనారిటీలు అన్ని వృత్తులలో బీసీల పొట్ట కొడుతున్నారు. మార్వాడీలు ఎవరి ఉత్పత్తులు దోచుకోవడం లేదు. ఇది ఒక కుట్ర.. హిందూ సమాజం జాగృతం అవుతుంది. రోహింగ్యాలు గో బ్యాక్ అని మేం అంటాం..అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Next Story