బీహార్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. ఆయన పర్యటన రద్దైనట్లు భారతీయ జనతా పార్టీ వర్గాలు జనవరి 27, శనివారం నాడు తెలిపాయి. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం జరగాల్సిన కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
అమిత్ షా జనవరి 28, ఆదివారం నాడు తెలంగాణలోని మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించడానికి, లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించడానికి హాజరు కావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు అందరి దృష్టి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఉంది. ఈ రాజకీయ పరిణామాలపై అమిత్ షా ఎక్కువ శ్రద్ధ చూపే అవకాశం ఉందని అంటున్నారు.