ఓటు వేయడానికి వచ్చి ఇద్దరు కన్నుమూత

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతూ ఉంది. అయితే సంగారెడ్డి జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  30 Nov 2023 12:23 PM GMT
ఓటు వేయడానికి వచ్చి ఇద్దరు కన్నుమూత

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతూ ఉంది. అయితే సంగారెడ్డి జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ఉద్యోగికి గుండెపోటు వచ్చింది. ఆయన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లేలోపే మరణించారు. చనిపోయిన అధికారిని 48 ఏళ్ల సుధాకర్‌ గా గుర్తించారు. ఆయన వెటరినరీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్‌లో 248 పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తుండగా సుధాకర్‌కు గుండె పోటు వచ్చింది. ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే సుధాకర్ మరణించినట్టు వైద్యులు తెలిపారు.

ఆదిలాబాద్‌ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మావల గ్రామానికి చెందిన తోకల గంగమ్మ (78) పోలింగ్‌ బూత్‌ దగ్గరికి వచ్చే సరికి ఫిట్స్‌ వచ్చి పడిపోయారు. ఆమెను రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భుక్తాపుర్‌నకు చెందిన రాజన్న (65) అనే వృద్ధుడు ఓటేసేందుకు వరుసలో నిల్చున్నారు. అంతలోనే కళ్లు తిరిగిపడిపోవడంతో ఆయన్ని కూడా రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Next Story