తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన ట్వీట్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచే ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. పాఠశాలలు, కాలేజీలు మళ్ళీ ఈ నెల 1న తెరుచుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుండగా.. ఈ నెల 30న పోలింగ్ .. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి.