బీఆర్ఎస్‌లో చేరిన తుల ఉమ
బీజేపీ నాయకురాలు తుల ఉమ ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.
By Medi Samrat Published on 13 Nov 2023 10:29 AM GMTబీజేపీ నాయకురాలు తుల ఉమ ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరని అన్నారు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి దొంగ దారిన ఇంకొకరికి ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీలో బీసీని ముఖ్యమంత్రి చేయడం అనేది ఒక కల మాత్రమే.. అందుకు ఉదాహరణ నేనే.. నాకు చెప్పింది ఒకటి.. చేసింది ఒకటి అని అన్నారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీ. కేవలం కింది స్థాయి కార్యకర్తలను మాత్రమే వాడుకుంటుందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి ఉన్నాను. అనేక హోదాల్లో పని చేసాను ఇక్కడ ఇచ్చిన గౌరవం బీజేపీ పార్టీలో ఇవ్వలేదన్నారు. అందుకే దయచేసి బీజేపీ కార్యకర్తలారా ఆగం కాకండి.. వారు కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు.. దయచేసి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇప్పుడు నా సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది. మధ్యలో కొద్దిగా సమస్య ఉన్నప్పటికీ తిరిగి నా సొంత గూడు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అదే ఉత్సాహంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కి పని చేస్తామని తెలిపారు.