అధికారంలో లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. సీఎం రేవంత్ గేమ్ అడకుండా ఉంటాడా..? : జగ్గారెడ్డి

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు.. 76 ఏండ్ల క్రితం.. ఉన్న పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. బీజేపీ చరిత్ర 40 ఏండ్ల చరిత్రనే.. ఇది ప్రజలు ఆలోచించాల్సిన విషయమ‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ జగ్గారెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  19 April 2024 9:15 PM IST
అధికారంలో లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. సీఎం రేవంత్ గేమ్ అడకుండా ఉంటాడా..? : జగ్గారెడ్డి

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు.. 76 ఏండ్ల క్రితం.. ఉన్న పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. బీజేపీ చరిత్ర 40 ఏండ్ల చరిత్రనే.. ఇది ప్రజలు ఆలోచించాల్సిన విషయమ‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ మేమే దేశ భక్తులం అని డబ్బా కొట్టుకుంటున్నారు. లేనిది ఉన్నట్టు చెప్పుకుని లబ్ది పొందే పనిలో బీజేపీ ఉందన్నారు. అసలైన దేశ భక్తుల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమ‌న్నారు. వాళ్ళు ఒరిజినల్ దేశ భక్తులు కాబట్టి.. మేమే దేశ భక్తులం అని చెప్పటం లేదన్నారు. డూబ్లికేట్ దేశ భక్తులు బీజేపీ వాళ్ళు.. అందుకే డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు. గ్రాఫిక్స్ లీడర్స్ బీజేపీ వాళ్ళు అని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ ముత్తతా మోతిలాల్ నెహ్రు .. కాంగ్రెస్ అద్యక్షుడు. 1919, 1928 లో కాంగ్రెస్ అద్యక్షుడు అయ్యారు. ధనిక కుటుంబం ఆయనది. మోతిలాల్ నెహ్రు సంపద అంతా.. స్వతంత్ర ఉద్యమం కోసం పెట్టారు.. ఇది చరిత్ర. బీజేపీ వాళ్ళు మేమే దేశభక్తులం అని చెప్పుకుంటున్నారు. అసలైన దేశ భక్తులు క్లెయిమ్ చేసుకోవడం లేదు.. డూప్లికేట్ దేశ భక్తులు బీజేపీ నేతలన్నారు.

.కాంగ్రెస్ లోకి ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారు అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యేల‌ చేరిక అంశం నా పరిధి కాదన్నారు. కేసీఆర్ ఏ ఆలోచనతో ప్రభుత్వం కూలిపోతుంది అనేది తెలియదు కానీ ఆయన వ్యూహాన్ని తిప్పి కొట్టే ఆలోచన మా దగ్గర ఉందన్నారు. ఐదేళ్లు ప్రజలను ఎలా మెప్పించాలనే ఆలోచనలో ఉన్నామ‌న్నారు. అధికారంలో లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. సీఎం రేవంత్ గేమ్ అడకుండా ఉంటాడా..? అని ప్ర‌శ్నించారు. వంద మంది ఉన్న కౌరవులను ఐదుగురు పాండవులు కూల్చేశారు. మేము ఇక్కడ పాండవులం అన్నారు.

నార్త్ లో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి.. మూడో ప్లేస్ లో ఉన్న బీజేపీ సోషల్ మీడియా లో మాత్రం బీజేపీ ముందు ఉంది అని ప్రచారం చేసుకుంటుంది. ఎన్డీఏ తగ్గుతుంది.. ఇండియా పెరుగుతుంది.. రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్లనే ఇండియా గ్రాఫ్ పెరిగిందన్నారు.

Next Story