Jagga Reddy : కేసీఆర్ అధికారంలో ఉంటే ప్రగతి భవన్, ఫౌంహౌస్.. లేదంటే..

8 నెలల పూర్తి సమయం మా నాయకత్వం అంతా ప్రజల మధ్యే ఉందని.. గత పదేళ్లు ప్రజల మధ్య కేసీఆర్ ఏనాడూ లేడని.. అందుకే బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  15 Aug 2024 12:54 PM GMT
Jagga Reddy : కేసీఆర్ అధికారంలో ఉంటే ప్రగతి భవన్, ఫౌంహౌస్.. లేదంటే..

8 నెలల పూర్తి సమయం మా నాయకత్వం అంతా ప్రజల మధ్యే ఉందని.. గత పదేళ్లు ప్రజల మధ్య కేసీఆర్ ఏనాడూ లేడని.. అందుకే బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రజలు నచ్చి, మెచ్చే పాలనను మా ప్రభుత్వం అందిస్తుందని.. ప్రజలు ఇచ్చిన సమయాన్ని మా ప్రభుత్వం వృధా చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, లోపాలు అన్నీ ఇన్నీ కావు.. వాటంన్నిటి మా ప్రభుత్వం సవరిస్తుందన్నారు. గత ప్రభుత్వ లోపాలను సవరించడమే కాకుండా, మళ్ళీ తప్పిదాలు జరగకుండా మెరుగైన పాలన అందిస్తున్నామ‌న్నారు. నేటితో 2 లక్షల రుణమాఫీ పూర్తయింది.. ఎవరైనా కొందరు రైతులు మిగిలితే వారందరికీ రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇంత క్లారిటీగా మా పాలన ఉంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని ప్ర‌శ్నిస్తున్నారు. అధికారం లేకపోయే సరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు పిచ్ఛిలేస్తుంది, నిద్ర పట్టడం లేదన్నారు. 8 నెలలకే ఉప ఎన్నికలు అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికల పిచ్చి ఏంటి.. బీఆర్ఎస్ కు ఉప ఎన్నిక పిచ్చి పట్టిందా అని ఫైర్ అయ్యారు.

కేటీఆర్ కు ఎన్నికలు అంటే అంత ఇష్టమా.. మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు సున్నా ఇచ్చారు. కేసీఆర్ సోంత ఇలాఖా లోనే బీఆర్ఎస్ ఓడిపోయింది. ట్రబుల్ షూటర్ అనే హరీష్ రావు కు ఏమైంది.. మెదక్ లో బీఆర్ఎస్ 3వ‌ స్థానం అన్న విషయం కేటీఆర్ మర్చిపోయారా అని ప్ర‌శ్నించారు. అధికారంలో ఉన్న పార్టీలో నేతలు చేరడం కామన్.. తమ సొంత ఊరికి పనులు చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లను బీఆర్ఎస్ లో చేర్చుకుని.. చేరిన వారే అసలైన కాంగ్రెస్ అని చెప్పింది మీరు కాదా.. చేరికలకు బాట వేసిందే మీరు, సాంప్రదాయం మొదలు పెట్టిందే కేసీఆర్ అని అన్నారు.

పదేళ్ళలో కేసీఆర్ ఏనాడూ ప్రజా పాలన అందించలేదన్నారు. కేసీఆర్ అధికారంలో ఉంటే ప్రగతి భవన్, ఫౌంహౌస్.. ప్రతిపక్షంలో ఉంటే ఉప ఎన్నికలు.. ఇది బీఆర్ఎస్ స్టాండ్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాడుతుంది.. అధికారంలో ఉంటే ప్రజా పరిపాలన అందిస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఉప ఎన్నికల జపాన్ని మానండి. ప్రజా సమస్యలపై సూచనలను ఇవ్వండి, మేము స్వాగతిస్తామ‌ని.. గ్లోబల్ ప్రచారాన్ని ఇక ఆపండన్నారు.

రుణమాఫీ బీఆర్ఎస్ నేతల కళ్ళ ముందే చేసాం.. కనపడడం లేదా.. కళ్ళ కు గంతలు కట్టుకున్నారా.. లేక రైతుల సంతోషం చూడలేకపోతున్నారా.. అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ గళ్ళీ పార్టీ.. మాది ఢిల్లీ పార్టీ. తెలంగాణ ప్రజలు సోనియా, రాహుల్ గాంధీ లకు ఓటేసారు..కేటీఆర్ ఇది గుర్తు పెట్టుకో అని హెచ్చ‌రించారు. గళ్ళీ పార్టీ కి లీడర్ గళ్ళీ లో ఉన్నడు.. మా ఢిల్లీ పార్టీ కి లీడర్ ఢిల్లీ లో ఉన్నాడు. మేము చేస్తున్న ప్రతీ పనిని మా లీడర్ కు చెప్తున్నాం.. ఆరోజు సోనియా గాంధీని కేసీఆర్ కుటుంబం కలిస్తే తప్పులేదా.. మేము కలిస్తే తప్పు వచ్చిందా అని ఫైర్ అయ్యారు.

ప్రజల మధ్య ఉండేది కాంగ్రెస్ , ఫాంహౌస్ లో ఉండేది కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి కావాల్సింది ప్రజా పరిపాలన.. కేసీఆర్, కేటీఆర్ లకు కావాల్సింది ఉప ఎన్నికలు అని అన్నారు. పదేళ్ళలో మీరు చేయలేని రుణమాఫీని, మేము 8 నెలల్లో ఓకే కిస్తీలో రుణమాఫీ చేస్తే ఎందుకు మీ ఏడుపులు అని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉంటే ఫాంహౌస్, అధికారం లేకపోతే ఉప ఎన్నికలు.. ఇది బీఆర్ఎస్ సిద్దాంతం అన్నారు.

ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం, అధికారంలో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం ఇది కాంగ్రెస్ సిద్దాంతం అన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం సోనియా గాంధీ ని ఢిల్లీకి వెల్లి కలసారు కదా.. మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పా.. అయినా మీది గళ్ళీ పార్టీ, మాది ఢిల్లీ పార్టీ అని అన్నారు.

Next Story