ప్రతిపక్షం ఎలా ఉండాలో నేను ట్రైనింగ్ ఇస్తా : జగ్గారెడ్డి

వర్షం కారణంగా హైదరాబాద్ లో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  4 Sept 2024 2:34 PM IST
ప్రతిపక్షం ఎలా ఉండాలో నేను ట్రైనింగ్ ఇస్తా : జగ్గారెడ్డి

ఐదు రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్రాలో వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద మొత్తంలో వర్షాలు రావడంతో చెరువులు, వాగులు అలగులు పడుతున్నాయి. జంట నగరాల్లో కూడా ఎప్పుడు వర్గాలు ఎక్కువగా కురుస్తున్నాయి.. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం కారణంగా హైదరాబాద్ లో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇళ్లు మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. డిప్యూటీ సీఎం భట్టి, తుమ్మల, పొంగులేటి మూడు రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలు అందిస్తున్నారని.. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో స్వయానా వరద ప్రాంతాల్లో పర్యటించారని పేర్కొన్నారు. మహబూబాబాద్ లో కూడా మంత్రి సీతక్క, సీఎం పర్యటించారన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల పరిస్తితి మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షిస్తున్నారు.. సూర్యాపేట, హుజూర్ నగర్ లో పర్యటిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే.. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రూ.7 వేల కోట్ల నష్టం జరిగింది.. తక్షణ సాయం కోసం కేంద్రం 2 వేల కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారని తెలియ‌జేశారు.

ఖమ్మంలో పర్యటించిన ప్రతిపక్ష నేతలు ప్రభుత్వనికి సూచనలు చేయండ‌ని సూచించారు. పవర్ పోయిన ఆ మైకం నుంచి హరీష్ రావు బయటకు రావడం లేదన్నారు. ప్రతిపక్షం ఎలా ఉండాలి అనేది కాంగ్రెస్ పక్షాన నేను ట్రైనింగ్ ఇస్తానని అన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం మొదట ప్రజలను సేఫ్‌ జోన్ లోకి తేవాలన్నారు. ప్రతిపక్షాల రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదన్నారు. ప్రభుత్వం మీద బురద జల్లెందుకు బీఆర్ఎస్‌ చంద్రబాబును మెచ్చుకుంటుందన్నారు. బీఆర్ఎస్‌ ఎప్పుడు చంద్రబాబును మోచుకుంటుందో.. తిడుతుందో తెలియదన్నారు.

మన ప్రతిపక్ష నాయకుడిగా.. మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ ఇంట్లో ఉండి పార్టీని నడిపిస్తున్నారు.. అది ఆయన ఇష్టం.. విమర్శలు చేయమ‌న్నారు. కాంగ్రెస్, BRS కి చాలా వ్యత్యాసం ఉందన్నారు. కాంగ్రెస్ వాస్తవాలకు దగ్గరగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ శ్రద్ధగా పని చేస్తుంది.. కానీ ప్రచారానికి ప్రయారిటీ ఇవ్వదన్నారు. BRS 90 శాతం పబ్లిసిటీ చేసి.. 10శాతం పని చేస్తుంద‌న్నారు. ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు వంద శాతం ప్రయారిటీ ఇస్తుందన్నారు.

Next Story