కేసీఆర్ అసెంబ్లీకి రావొద్దనే హరీష్ రావు డ్రంక్ టెస్టు పెట్టాలంటున్నారు

దేశ ప్రజల భవిష్యత్తు కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నార‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  18 Dec 2024 3:30 PM GMT
కేసీఆర్ అసెంబ్లీకి రావొద్దనే హరీష్ రావు డ్రంక్ టెస్టు పెట్టాలంటున్నారు

దేశ ప్రజల భవిష్యత్తు కోసమే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నార‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. దేశ సంపదను దోచుకుంటుంన్న అదానీకి వ్యతిరేకంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చిందని తెలిపారు. పేదల కడుపు నింపేందుకు యూపీఏ ప్రభుత్వం తెచ్చిన అద్బుతమైన పథకం ఉపాధిహామీ.. పేదల సంక్షేమం కోసం యూపీఏ పనిచేసినా.. మోదీ మాటలను దేశం నమ్మిందన్నారు. మోదీ అంటే ఫైనాన్స్ కార్పోరేషన్ డిపార్ట్మెంట్.. కాంగ్రెస్ ఉపాధిహామీ ద్వారా పేదలకు డబ్బు ఇస్తే.. మోదీ అదానీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా పేద ప్రజల డబ్బును అదానీకి ట్రాన్ఫర్ చేస్తున్నారన్నారు. అందుకే అదానీకా హాఠావో దేశ్ కి బచావో నినాదాన్ని రాహుల్ తీసుకున్నారన్నారు.

రాహుల్ గాంధీ అంటే విజన్.. మోదీకి ఎలాంటి విజన్ లేదన్నారు. అదానీ కళ్ళల్లో ఆనందం కోసం దేశాన్ని మోదీ పణంగా పెడుతున్నారన్నారు. మోదీ, అదానీ రాజకీయ వ్యాపారం చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్ట‌రా.. లేక చౌకిదారి పనిచేస్తున్నాడా అని ప్ర‌శ్నించారు. అదానీ మోసం చేసాడని అమెరికా చెప్తుంటే.. ఇంకా సాక్ష్యం ఏం కావాలన్నారు.

కవిత జైలుకు వెళ్లొచ్చాక మెంటల్‌గా డిస్టర్బ్‌ అయింది.. ఆమె ఏదోది మాట్లాడుతుందన్నారు. కవితకు రెస్ట్ అవసరం, జైలు జీవితం నుంచి ఇంకా కవిత బయటకు రాలేదన్నారు. కిషన్ రెడ్డి సొంతంగా ప్రెస్ మీట్ పెట్టలేడు.. ఏవరో స్కిప్ట్ ఇస్తే చదువుతారు. అందుకే అన్ని తప్పులు ఉంటాయన్నారు. కిషన్ రెడ్డి డెసిషన్ లీడర్ కాదు.. సలహాలు ఇచ్చినా తీసుకునేవారు లేరన్నారు. కిషన్ రెడ్డి కాదు.. స్క్రిప్ట్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎంత యాక్టివ్ గా ఉంటే మాకు అంత మంచిదన్నారు. అసెంబ్లీలో డ్రింక్ టెస్టు ఎందుకు.. కేసీఆర్ ఇప్పటికే సభకు రావడం లేదు.. డ్రింక్ టెస్టు పెడితే అసలే కేసీఆర్ సభకు రాడు.. కేసీఆర్ రావొద్దనే హరీష్ రావు డ్రంక్ టెస్టు పెట్టాలంటున్నారని కామెంట్ చేశారు.

Next Story