కోర్టు చెప్పినా ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాపోయారు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చామని గుర్తుచేశారు. నేను ప్రజల మనిషిని.. నాకు సెక్యూరిటీతో పనిలేదన్నారు. నేను సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వస్తానని సవాల్ విసిరారు. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా? అని ప్రశ్నించారు. నన్ను ఓడించడానికి పోలీసులను కేసీఆర్ వాడుకున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ విషయంలో నన్ను భయపెట్టాలని చూస్తే భయపడేవాడిని కాదని అన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నా సైన్యం. నా సెక్యూరిటీ వాళ్ళేనని స్పష్టం చేశారు.