రాజగోపాల్ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తాడు : రేవంత్

TPCC President Revanth Reddy Fire On TRS and BJP. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనించాల‌ని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్

By Medi Samrat  Published on  11 Oct 2022 8:15 PM IST
రాజగోపాల్ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తాడు : రేవంత్

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనించాల‌ని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నియోజ‌క‌వ‌ర్గంలోని పుల్లెంల ప్ర‌చారంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. మోడీ, కేడీ ఆలోచన ఒక్కటే.. వారి లక్ష్యం కాంగ్రెస్ ను చంపడమేన‌ని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కాంగ్రెస్ ను లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తాడని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో సమస్యలపై కొట్లాడలేదని.. శత్రువు పంచన చేరి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ను చంపాలని చూస్తుండని విమ‌ర్శించారు.

పెంచి పోషించిన కాంగ్రెస్ కు ద్రోహం చేయడం దుర్మార్గం కాదా? అని ప్ర‌శ్నించారు. 2014లో గెలిచిన కూసుకుంట్ల ఏం వెలగబెట్టారు? అని నిల‌దీశారు. ఇద్దరూ దొంగలకు సద్ది కట్టే రకమే.. ఊరికి మేలు చేసేవారు కాదని విమ‌ర్శించారు. కష్టం వచ్చిందని కేసీఆర్ ఇప్పుడు కమ్యూనిస్టుల కాళ్లు పట్టుకున్నాడు. కమ్యూనిస్టు కార్యకర్తలు ఆత్మప్రభోదానుసారం కాంగ్రేస్ కు ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు. టీఆర్ఎస్, బీజేపీ లకు భయం పుట్టి చండూరులో మా పార్టీ ఆఫీసు తగలపెట్టారు. దొంగల్లా రాత్రి వచ్చుడు కాదు.. దమ్ముంటే ఎదురుగా వచ్చి చూడండని స‌వాల్ విసిరారు. చండూరు చౌరస్తాకు రండి మా సత్తా చూపుతాం అని హెచ్చ‌రించారు. చెల్లి స్రవంతిని గెలిపించండి.. అసెంబ్లీలో కేసీఆర్ తో కొట్లాడుతదని పిలుపినిచ్చారు.


Next Story