నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

TPCC President Revanth Reddy. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు.

By Medi Samrat  Published on  14 March 2023 7:30 PM IST
నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

TPCC President Revanth Reddy


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. తాజాగా కూడా ఆయన కాంగ్రెస్ సీనియర్ లీడర్లపై వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమ్ముడుపోయారంటూ రేవంత్ రెడ్డి అన్నారనే వార్తలు దుమారాన్ని రేపాయి.

ఈ విషయం ఎట్టకేలకు రేవంత్ రెడ్డి వరకూ వెళ్లాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు తాను చేశానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తన మాటలను వక్రీకరించారని తెలిపారు. కాంగ్రెస్ లో సీనియర్లు అమ్ముడుపోయారంటూ ఓ పత్రిక తప్పుడు వార్తలు రాసిందని, తాను అనని మాటలను అన్నట్టుగా రాశారని అన్నారు. ఈ వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు. వార్తలు రాసే విషయంలో మీడియా సంయమనం పాటించాలని.. రాజకీయ వివాదాలను సృష్టించి సమస్యను జఠిలం చేసే ప్రయత్నాలు చేయవద్దని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన వర్గానికి మరో వర్గానికి అసలు పొసగడం లేదు.


Next Story