బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : టీపీసీసీ చీఫ్‌

ప్రజా స్వామ్య బద్దంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుందని టీపీసీసీ అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on  5 Dec 2024 4:17 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : టీపీసీసీ చీఫ్‌

ప్రజా స్వామ్య బద్దంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుందని టీపీసీసీ అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం.. అర్హులకు ఇళ్లు అందడమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం అని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని స్ప‌ష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతల్ని బెదిరింపులకు గురి చేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది.. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తో టచ్ లో ఉన్నారని సంచ‌ల‌నానికి తెర‌లేపారు.

కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంద‌న్నారు. కౌశిక్ - హరీష్ రావు వివాదంపై స్పందిస్తూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే ఉపేక్షించేది లేదన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదు అని హెచ్చ‌రించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చట్టం తన పని తాను చేసుకుంటుపోతుందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.. కౌశిక్ రెడ్డి వాడిన భాష ఏ విధంగా ఉందో మీడియాలో చూశామ‌న్నారు.

Next Story