ఫాం హౌస్‌లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు.?

మహిళల విద్యా ప్రధాత సావిత్రి బాయి పూలే.. దేశంలో మొదటి మహిళా పాఠశాల స్థాపించి దళిత, అణగారిన వర్గాలకు విద్యనందించిన మహిళ ఉపాధ్యాయురాలు అని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on  3 Jan 2025 4:15 PM IST
ఫాం హౌస్‌లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు.?

మహిళల విద్యా ప్రధాత సావిత్రి బాయి పూలే.. దేశంలో మొదటి మహిళా పాఠశాల స్థాపించి దళిత, అణగారిన వర్గాలకు విద్యనందించిన మహిళ ఉపాధ్యాయురాలు అని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రి బాయి పూలే 194 వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. మహిళలు చదువుకునేందుకు తొలి అడుగు సావిత్రి బాయి పూలే వేశారన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కి కట్టుబడి ఉన్నాం.. మహిళా కళాశాల ఏర్పాటు చేసిన వీర వనిత సావిత్రి బాయి పూలే అన్నారు.

విద్య ఆత్మవిశ్వాసం ఇస్తుందన్న సావిత్రి బాయి మాటలు మహిళలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలన్నారు. సావిత్రి బాయి పూలే పేరిట యూనివర్శిటీ ఏర్పాటు కోసం కృషి చేస్తాన‌న్నారు. అణగారిన వర్గాల విముక్తికి తన జీవితం అంకితం చేసిన గొప్ప మహనీయురాలు.. కట్టుబాట్లకు లోబడి మహిళలు బయటికి రాలేని రోజుల్లో మహిళా సాధికారత కోసం సావిత్రి బాయి పూలే పోరాడారు.. ఏదైనా యూనివర్సిటీకి జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే పేర్లను పెట్టేందుకు కృషీ చేస్తామ‌న్నారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం అనైతికం అన్నారు.

విద్య, వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దూర దృష్టితో ముందుకెళ్తుంది.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కార్పొరేషన్ కైనా నిధులు కేటాయించారా.? అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సవాలు చేస్తున్నా.. బీసీ బిడ్డను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే సత్తా ఉందా.? అని ప్ర‌శ్నించారు. కుల సర్వే కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తెలంగాణలో కుల గణన సర్వేపై దేశ వ్యాప్తంగా చర్చ జరగుతుందన్నారు.

బీసీ బిడ్డలుగా కాంగ్రెస్ లో పోరాడుతున్నాం.. జ్యోతిరావు పూలే తరువాత మరొక పూలే రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే కుల గణన సర్వే చేసి తీరాలన్నారు. మోసం చేసి నిట్ట నిలువునా ముంచిన బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ఫాం హౌస్‌లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు.? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. కులాలకు అతీతంగా ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీలో ఉంది.. బీఆర్ఏస్, బీజేపీ పార్టీలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుందా.? అని ప్ర‌శ్నించారు.

Next Story