టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ సెటైర్లు వేశారు. సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపారని.. అహనా పెళ్ళంట బీఆర్ఎస్‌కు సరిగ్గా సరిపోతుందన్నారు. సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపారన్నారు. కేబినెట్ లో ఐదేళ్లు మహిళ మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బిఆర్ఎస్ పార్టీది అని మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు.
బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే జూబ్లీ హిల్స్ లో బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ సహకరించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ రుణం తీర్చుకోవడానికి బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతీ నిర్ణయంలో కేసీఆర్ పాత్ర ఉందన్నారు.
రాష్ట్రపతి అధ్యక్ష పదవిని నుంచి మొదలుకొని ట్రిపుల్ తలాక్ వరకు కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇచ్చారన్నారు. డబ్బుతో ఓట్లను కొలవడమన్నది అనైతిక చర్య అన్నారు. ఐదు వేలు తీసుకోండి.. బీఆర్ఎస్ కి ఓటేయండి? కేటీఆర్ మాట ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య అన్నారు. ఎలక్షన్ కమిషన్ తక్షణమే కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మెజార్టీ అమలు చేశామని.. హామీలను అమలు చేసి ఓట్లు అడుగుతున్నామన్నారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని అమాయకులైన నిరుద్యోగులను బలిగొన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబంలో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు.