రాజకీయాల కోసం కాదు.. రాకేష్‌ కుటుంబాన్ని పరామర్శించాలని వెళ్తున్నా..

TPCC Leader Revanth Reddy Fire On Govt. నిన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేష‌న్‌లో జ‌రిగిన కాల్పుల‌లో మ‌ర‌ణించిన‌ రాకేష్ కుంటుంబాన్ని

By Medi Samrat  Published on  18 Jun 2022 9:03 AM GMT
రాజకీయాల కోసం కాదు.. రాకేష్‌ కుటుంబాన్ని పరామర్శించాలని వెళ్తున్నా..

నిన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేష‌న్‌లో జ‌రిగిన కాల్పుల‌లో మ‌ర‌ణించిన‌ రాకేష్ కుంటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు న‌ర్సంపేట‌కు బ‌య‌లుదేరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఘ‌ట్‌కేస‌ర్ వ‌ద్ద అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాకేష్‌ను చంపింది టీఆర్ఎస్.. చంపించింది బీజేపీ అని వ్యాఖ్యానించారు. రాకేష్ కుటుంబాన్ని పరామర్శిస్తే.. రాకేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తే.. వరంగల్‌కు వెళ్తే పోలీసులకు వచ్చే ఇబ్బంది ఏంటి అని ప్ర‌శ్నించారు

టిఆర్ఎస్ మంత్రులు రాకేష్ శవయాత్ర చేయొచ్చు.. గులాబీ జెండాలు కట్టుకొని యాత్రలో పాల్గొనవచ్చు. మేము వెళ్ళడానికి ఇన్ని అడ్డంకులా.? అని ఫైర్ అయ్యారు. చావులను కూడా టిఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంద‌ని విమ‌ర్శించారు. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరని.. త్వరలో సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లేరేషన్ ప్రకటిస్తామ‌ని అన్నారు. మ‌మ్మ‌ల్ని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది నా పార్లమెంట్ నియోజక వర్గం. రాకేష్‌ కుటుంబాన్ని పరామర్శించాలని వెళ్తున్నా.. రాజకీయాల కోసం కాదు.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ పోలీసుల‌ను నిల‌దీశారు.


Next Story
Share it