బీసీలపై మాట్లాడే హక్కు ఈటల, బండికి లేదు: టీపీసీసీ చీఫ్

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్, కేటీఆర్..అని టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు

By -  Knakam Karthik
Published on : 30 Sept 2025 1:56 PM IST

Telangana, Hyderabad, Tpcc Chief Maheshkumar, Bjp, Bandi Sanjay, Eatala Rajendar

బీసీలపై మాట్లాడే హక్కు ఈటల, బండికి లేదు: టీపీసీసీ చీఫ్

హైదరాబాద్: ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్, కేటీఆర్..అని టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాట ఇచన ప్రకారం చేసుకుంటూ పోతున్నాం. కాంగ్రెస్‌కి డిపాజిట్లు రావనీ బీజేపీ, బిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, వరికి బోనస్ ఇవ్వడం, రుణ మాఫీ చెయ్యడం బాకీ పడ్డట్లా. మీ ఇంట్లో వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ప్రజలకి ఎవరు బాకీ పడ్డారు.. మీరా మేమా...కాళేశ్వరం ప్రాజెక్టు తో, ఫార్ములా ఈ రేస్ తో మీరు దోచుకున్నారు. రేషన్ కార్డులు పెద్ద ఎత్తున ఇచ్చి సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే. ఎరువుల స్టాక్ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది. ఎరువుల పేరుతో మా ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్ర. GST తగ్గింపు వల్ల రాష్ట్రానికి 7 వేల కోట్ల నష్టం. బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటే.. మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం..అని మహేశ్ కుమార్ అన్నారు.

స్థానిక ఎన్నికలలో 80 శాతం సీట్లు గెలుస్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుస్తాం. ఈటెల రాజేందర్ కి సూటి ప్రశ్న. మేము చిత్త శుద్ధితో బీసీ రిజర్వేషన్ల పై జీ వో ఇచ్చాం. బీసీ ల నోటి కాడి ముద్ద లాక్కునే ప్రయత్నం బీజేపీ, బిఆర్ ఎస్ చేస్తున్నాయి. కోర్టులో కేసు ఉన్నా జీవో ఇచ్చి ధైర్యంగా ముందుకు వెళుతున్నాం. ఈటెల రాజేందర్, బండి సంజయ్ కి బీసీ లపై మాట్లాడే హక్కు లేదు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నాను... వ్యతిరేకంగా వస్తే సమీక్ష చేస్తాం. హైడ్రా లోపాలు ఉంటే సమీక్షిస్తాం. హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరించాలి.. ప్రభుత్వ ఆస్తులు ఇంచ్ కూడా ఆక్రమణకి గురి కాకుండా హైడ్రా చూడాలని నేను కోరుకుంటున్నా. హైడ్రా వల్ల ఒక్క పేద వాడి ఇళ్ళు కూలింది.. వారికి పునరావాసం ఏర్పాటు చేశాం...అని టీపీసీసీ చీఫ్‌ వ్యాఖ్యానించారు.

Next Story