జానారెడ్డిపై రాజగోపాల్‌ కామెంట్స్‌..టీపీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదే

కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛకు కొదవలేదు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Knakam Karthik
Published on : 14 April 2025 2:22 PM IST

Telangana, Congress, Tpcc Chief Mahesh, Mla Rajagopalreddy, Ktr, Brs

జానారెడ్డిపై రాజగోపాల్‌ కామెంట్స్‌..టీపీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదే

కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛకు కొదవలేదు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి వర్గ విస్తరణప కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం ఆయన వ్యక్తిగతం..అని చెప్పారు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. కేసీఆర్, కేటీఆర్ పగటి కలలు మానుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రమేయంతోనే పెద్ద ఎత్తున రైస్ స్కామ్ జరిగింది. సన్న బియ్యం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి ఎగుమతి చేసిన విషయం మరిచిపోయారా? 15 నెలల కాంగ్రెస్ ప్రజాపాలనలో మార్పు చూపించగలిగాం. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తోంది. ఉచిత బస్సు నుంచి సన్న బియ్యం వరకు ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది. కేసీఆర్ కుటుంబం ఆర్థిక దోపిడీ చూసి భయపడి కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కేటీఆర్ అరెస్టు కావాల్సిందే. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అని టీపీసీసీ చీఫ్ అన్నారు.

మూడు దశాబ్ధాల ఎస్సీ వర్గీకరణ మోక్షానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవో విడుదల చేశాం. ఎస్సీ వర్గీకరణ, కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ధరణితో విసిగి వేసారిన ప్రజలకు భూ భారతితో మోక్షం కల్పించాం. ప్రజలకు మేలు జరిగే విధంగా భూ భారతి ఉంటుంది. ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజలకు లబ్ది చేకూరే విధంగా మరికొన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది...అని మహేశ్‌ కుమార్ పేర్కొన్నారు.

Next Story