ఆ పదవి దక్కలేదన్న అక్కసుతోనే మాట్లాడుతున్నారు..ఈటలపై టీపీసీసీ చీఫ్ ఫైర్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఏ కులమో చెప్పాలి..అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార గౌడ్ డిమాండ్ చేశారు.
By Knakam Karthik
ఆ పదవి దక్కలేదన్న అక్కసుతోనే మాట్లాడుతున్నారు..ఈటలపై టీపీసీసీ చీఫ్ ఫైర్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఏ కులమో చెప్పాలి..అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదన్న అక్కసుతో ఈటల మాట్లాడుతున్నారు. సీఎంపై మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. బీఆర్ఎస్ హయంలో ఆర్థిక మంత్రిగా ఈటల ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది...అని మహేష్ గౌడ్ ఆరోపించారు.
హైడ్రా గురించి మాట్లాడే ఈటల దేవాదాయశాఖ భూములను కబ్జా చేశారని కేసు ఉన్న విషయం మర్చిపోయారా?. బీసీ బిడ్డవై కేసీఆర్‌కి అడుగులకు మడుగులు వత్తిన విషయం మరిచావా?. కేసీఆర్ హయంలో చేతకాని, దద్దమ్మ మంత్రులుగా ఉన్న మీరు సీఎం రేవంత్ గురుంచి మాట్లాడే నైతిక అర్హత లేదు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ పడిపోతుందా?. ధనిక రాష్ట్రమైన తెలంగాణ దివాలా తీయడానికి.. కారణమైన కేసీఆర్ అలీబాబా చోరిస్‌లో ఈటల ఒకరు.. అని మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్ ఏమి మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ నేతలు అడుగడుగునా అడ్డు పడుతున్నారు. బీసీ బిడ్డగా ఈటల, బండి సంజయ్‌ను ఎవరు అంగీకరించని పరిస్థితిలో లేరు. బీసీ బిల్లు విషయంలో బీజేపీ నేతల వైఖరిని బీసీ సమాజం క్షమించే పరిస్థితి లేదు. తప్పులు ఎత్తి చూపండి.. సద్వి విమర్శ చేయండి.. అంతేగాని స్వార్థంతో నోటికొచ్చింది మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు..అని టీపీసీసీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు.
టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ https://t.co/VReMcNp8zH
— Telangana Congress (@INCTelangana) May 12, 2025