క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు: టీపీసీసీ చీఫ్
స్వాతంత్ర్య ఉద్యమం ఏ విధంగా జరిగిందో నేటి యువత తెలుసుకోవాలని..టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు
By Knakam Karthik
క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: స్వాతంత్ర్య ఉద్యమం ఏ విధంగా జరిగిందో నేటి యువత తెలుసుకోవాలని..టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1942లో బ్రిటీష్ పాలకులను తరిమి కొట్టాలని అనేక ఉద్యమాలు జరిగినప్పటికి క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైనది. డూ ఆర్ డై నినాదంతో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ కాంగ్రెస్ చరిత్ర తుడిచివేయాలని చూస్తుంది. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ కలిసి.. నెహ్రూ, సర్దార్, సుభాష్ చంద్రబోస్ చరిత్రలో లేకుండా చేద్దాం అని కుట్రలు చేస్తున్నారు. రాజ్యాంగం మార్చాలని బిజెపి చూస్తుంది..అని మహేశ్ కుమార్ ఆరోపించారు.
స్వతంత్ర సంస్థలు వాడుకొని ప్రతిపక్షాలపై కుట్ర పూరిత దాడి చేస్తున్నాయి. ఎలక్షన్ కమీషన్ అంటే బీజేపీ ఫ్రంటల్ ఆర్గనేషన్ గా మారింది. ప్రశ్నిస్తే దేశ ద్రోహుల ముద్ర వేస్తున్నారు. క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు. కులాల,మతాల పేరిట భవిష్యత్తు లేకుండా బీజేపీ చేస్తుంది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక్కరూ అంటే ఒక్క బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు లేడు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం ఉద్యమం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ రక్షణ కోసం పని చేస్తుంది..అని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు.