గుడ్‌న్యూస్‌.. రేప‌ట్నుంచి మూడు రోజులు సెల‌వులు..!

ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల‌లోకి పాఠ‌శాల‌ల‌కు, ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్యాల‌యాల‌కు సంక్రాంతి సెల‌వులు ముగియ‌గా.. తాజాగా మ‌రో 3 రోజులు సెలవులు రానున్నాయి.

By -  Medi Samrat
Published on : 23 Jan 2026 8:38 AM IST

గుడ్‌న్యూస్‌.. రేప‌ట్నుంచి మూడు రోజులు సెల‌వులు..!

ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల‌లోకి పాఠ‌శాల‌ల‌కు, ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్యాల‌యాల‌కు సంక్రాంతి సెల‌వులు ముగియ‌గా.. తాజాగా మ‌రో 3 రోజులు సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్ సహా పలు కార్పొరేట్ కంపెనీలకు వారానికి ఐదు రోజులే ప‌ని దినాలు కావ‌డంతో ఉద్యోగులకు శని, ఆదివారాలు సెల‌వులు రానున్నాయి. అలాగే సోమవారం రిపబ్లిక్ డే కావడంతో వ‌రుస‌గా మూడు రోజులు హాలీడేస్ రానున్నాయి. దీంతో ఇది లాంగ్ వీకెండ్ కానుంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో కొన్ని ప్రైవేట్ స్కూళ్లు వారానికి 5 రోజులే నడుస్తున్నాయి. దీంతో శ‌ని, ఆదివారాలు ఎలాగూ పాఠ‌శాల‌ల‌కు హాలీడే కాగా.. 26వ తేదీన‌ పబ్లిక్ హాలిడే( రిపబ్లిక్ డే) కావడంతో విద్యార్ధులు కూడా రేపట్నుంచి సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.

Next Story