తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రంలోగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. కాగా షెడ్యూల్ ప్రకటించిన 15 రోజుల్లో ఎన్నికలు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మరో వైపు ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు సైతం స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
కాగా నేడు జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు, 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.