తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఫోన ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ప్రభాకర్ రావు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఫార్మాట్ చేసి ఇచ్చాడని, అందులో డేటా లేదని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. కాగా ఈ కేసులో స్థాయీ నివేదకిను తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనం ముందు ఉంచింది. అయితే ఈ కేసులో ప్రభాకర్ రావుకు మరో నాలుగు వారాల పాటు మధ్యంతర రక్షణను కొనసాగిస్తూనే..దర్యాప్తు పూర్తి చేయడానికి ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం మరికొంత సమయం ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.