అందుకు జనవరి 3ని ఫిక్స్ చేసిన బీఆర్ఎస్

లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని భావిస్తూ ఉంది. అందులో భాగంగా కీలక అడుగులు వేస్తూ ఉంది.

By Medi Samrat  Published on  29 Dec 2023 8:30 PM IST
అందుకు జనవరి 3ని ఫిక్స్ చేసిన బీఆర్ఎస్

లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని భావిస్తూ ఉంది. అందులో భాగంగా కీలక అడుగులు వేస్తూ ఉంది. జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సీనియర్ నేతలు కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు కీలక నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు.

తొలి విడతలో జనవరి 3వ తేదీ నుంచి 12 వరకు, రెండో విడత జనవరి 16వ తేదీ నుంచి 21 వరకు జరగనున్నాయి. జనవరి 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు విరామం ఇస్తారు. రెండో విడతలో భాగంగా 16న నల్గొండ , 17న నాగర్ కర్నూల్‌, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్ , 20న మల్కాజ్‌గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజవర్గాల సమావేశాలు జరుగనున్నాయి.

Next Story