TGSRTCలో ఉద్యోగాలు.. 81,400 వరకు జీతం

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (TSLPRB) మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

By -  Medi Samrat
Published on : 25 Dec 2025 2:46 PM IST

TGSRTCలో ఉద్యోగాలు.. 81,400 వరకు జీతం

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (TSLPRB) మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ (TST), మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ (MST) పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు.

ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీగా 84 ఖాళీలు, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీగా 114 ఖాళీలు ఉన్నాయి. ఈ రెండు వర్గాల పోస్టులకు నెలవారీ వేతనం రూ.27,080 నుంచి రూ.81,400 వరకు ఉండనున్నాయి.

అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ 2025 డిసెంబరు 30న ఉదయం 8 గంటల నుంచి 2026 జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అర్హత ప్రమాణాలు, ఆన్లైన్ అప్లికేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ, అభ్యర్థులకు ఇచ్చిన సూచనలతో సహా పూర్తి వివరాలు నోటిఫికేషన్ రూపంలో టీఎస్ఎల్‌ఆర్బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

Next Story