సోనూసూద్‌కు గుడి కట్టిన తెలంగాణ ప్రజలు

Temple for Sonu Sood built in Telangana. బాలీవుడ్ సినీనటుడు సోనూ సూద్‌కు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుడి కట్టారు.

By Medi Samrat  Published on  21 Dec 2020 6:48 AM GMT
సోనూసూద్‌కు గుడి కట్టిన తెలంగాణ ప్రజలు

బాలీవుడ్ సినీనటుడు సోనూ సూద్‌కు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుడి కట్టారు. దుల్మిట్ట మండలం దుబ్బతండాలో గుడి కట్టి అందులో సోనూ సూద్ విగ్రహం ప్రతిష్టించారు. సోనూ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. సోనూ సూద్‌ను నటుడిగానే కాకుండా దేవుడిగా చూస్తున్నామని గ్రామ‌స్తులు తెలిపారు. గుడిలో నిత్య పూజలు చేస్తామని పేర్కొన్నారు. తమ గ్రామం చుట్టూ 18 తండాలు ఉన్నా దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఆస్పత్రి లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రాంతంలో సోనూ సూద్ సహకారంతో ఆస్పత్రి నిర్మించుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే సోనూ సూద్ తమతో వీడియో కాల్‌లో మాట్లాడారన్నారు.



సినిమాల్లో విలన్‌గా కనిపించినప్పటికీ.. నిజ‌జీవితంలో హీరో అయ్యాడు. లాక్‌డౌన్‌ సమయంలో కష్టాల్లో ఉన్న వారికి విశేషమైన సేవలందించి రియల్‌ హీరోగా నిలిచాడు సోనూ సూద్‌. వేల సంఖ్యలో వలస కూలీలు తమ స్వస్థలాలకు చేర్చాడు. విదేశాల్లో ఉన్న వారిని సైతం స్వదేశానికి తీసుకొచ్చాడు.అలాగే ఆపదలో ఉన్న చాలా మందికి ఆదుకున్నారు. విద్యార్థులకు, రైతులకు, కార్మికులకు, ఉద్యోగం కోల్పోయినవారికి.. ఇలా చాలా మంది జీవితాల్లో సోనూ సూద్ వెలుగులు నింపారు. వలస కార్మికుల కోసం జాబ్ పోర్ట‌ల్‌ను కూడా ప్రారంభించాడు. దీంతో ఆయనను కలియుగ కర్ణుడు అని కీర్తిస్తున్నారు.


Next Story