ఆగస్టు 24వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరవ్వాల్సిందే.!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.

By Medi Samrat
Published on : 16 Aug 2024 7:19 PM IST

ఆగస్టు 24వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరవ్వాల్సిందే.!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కామెంట్స్‌ చేసిన నేపథ్యంలో కేటీఆర్‌కు కమిషన్‌ నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆగస్టు 24వ తేదీన మహిళా కమిషన్‌ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న కొందరు మహిళలపై కేటీఆర్‌ కొన్ని కామెంట్స్‌ చేశారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుని తాజాగా నోటీసులు ఇచ్చింది.

తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. గురువారం జరిగిన పార్టీ సమావేశంలోనే యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే.. తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అక్కాచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ తనకు లేదని ఎక్స్‌లో పోస్టు ద్వారా వెల్లడించారు కేటీఆర్.

Next Story