అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడిని విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన ప్రవీణ్ మిల్వాకీలోని ఒక విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువుతున్నాడు. రాఘవులు, రమాదేవి దంపతుల కుమారుడైన ప్రవీణ్ చదువుకుంటూనే అక్కడ ఒక స్టార్ హోటల్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.
ప్రవీణ్ బస చేసిన ప్రదేశానికి సమీపంలోని బీచ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బుల్లెట్ గాయాలకు ప్రవీణ్ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపు మరణించాడని నివేదికలు చెబుతున్నాయి.ఈ సంఘటన గురించి ప్రవీణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సొంత ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి.