పసుపు రైతులకు ధరల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు ఏమయ్యాయ్?: కవిత

నిజామాబాద్‌లో పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

By Knakam Karthik  Published on  11 March 2025 2:47 PM IST
Telangana, Brs Mlc Kavitha, Congress government, Bjp, Cm Revanth, Pm Modi, Turmeric Farmers-Agitation

పసుపు రైతులకు ధరల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు ఏమయ్యాయ్?: కవిత

నిజామాబాద్‌లో పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని అడిగారు. మాటలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని మండిపడ్డారు. క్వింటాలు పసుపుకు రూ.15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పసుపుకు కనీసం రూ.9 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇది రైతులను నయవంచన, మోసం చేయడమే. అని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇచ్చిన హామీ ఏమైంది ? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ₹ 15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Next Story